Sun Feb 01 2026 18:32:04 GMT+0000 (Coordinated Universal Time)
ఏసీబీకి చిక్కిన కాలుష్య తిమింగలం

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్న ఏసీబీకి మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. విజయవాడ కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ కార్యాలయ ఈఈ సత్యనారాయణ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారని అభియోగాలపై విజయవాడలో మారుతి హోసింగ్ కాలనీ సత్యనారాయణ ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. రాజమండ్రి, హైదరాబాద్, నెల్లూరు లో దాడులు కొనసాగుతున్నాయి.
విజయవాడతో పాటు ఏడు చోట్ల ఏకకాలంలో అనిశా అధికారులు తనిఖీలు చేస్తున్నారు.హైదరాబాద్, మాతృశ్రీ నగర్ లో నివాసం ఉంటున్న సత్యనారాయణ కుమారుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పవన్ కుమార్ ఇంటిలో సోదాలు చేసి 5 కిలోల వెండి తో పాటు విలువైన డాక్యూమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు
Next Story

