అంతా పాతబస్తీ కేంద్రంగానే
కరోనా కు వ్యాక్సిన్ రాలేదు.. ఇంకా రెండు నెలల సమయం పడుతుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలు చెబుతున్నాయి.. అయితే ముందస్తుగా యాంటీ వైరస్ డ్రగ్స్ మాత్రం [more]
కరోనా కు వ్యాక్సిన్ రాలేదు.. ఇంకా రెండు నెలల సమయం పడుతుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలు చెబుతున్నాయి.. అయితే ముందస్తుగా యాంటీ వైరస్ డ్రగ్స్ మాత్రం [more]

కరోనా కు వ్యాక్సిన్ రాలేదు.. ఇంకా రెండు నెలల సమయం పడుతుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలు చెబుతున్నాయి.. అయితే ముందస్తుగా యాంటీ వైరస్ డ్రగ్స్ మాత్రం రంగంలోకి దిగాయి. ఇప్పుడు ఈ డ్రగ్స్ మార్కెట్లో దొరకడం చాలా కష్టం అయిపోయింది. అంతే కాకుండా డ్రగ్స్ మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళింది. దీంతో కరోనా పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారు. వేల రూపాయల విలువ చేసే డ్రగ్ ను లక్షల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ పాత బస్తీ కేంద్రంగా నడుస్తున్న ఈ డ్రగ్ మాఫియా అధికారులు బట్టబయలు చేశారు. మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి దగ్గర నుంచి 35 లక్షల పైచిలుకు యాంటీవైరస్ స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫార్మా కంపెనీకి మెడికల్ ఏజెన్సీ గా వెంకట సుబ్రహ్మణ్యం యాంటీవైరస్ ముఠా వెనకాల పని చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఎవరైనా ఈ డ్రగ్స్ ను డైరెక్ట్ గా కొనడనికి వీలు లేదని అధికారులు చెప్పారు. ఆస్పత్రిలో రిఫరెన్స్ ఉన్న వాళ్లకు మాత్రమే డ్రగ్స్ అమ్మాలని పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. కేవలం ఆస్పత్రికి మాత్రమే వెళ్లవలసిన డ్రగ్స్ మాత్రమేనని, వీటిని బహిరంగ మార్కెట్లో అమ్మి నట్లయితే దీనిని అమ్మిన వారిపై చట్టపర మైన చర్యలు తీసుకుంటా మని వెల్లడించారు.

