Fri Mar 20 2026 22:56:13 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీఆర్ఎస్ లో మరో తిరుగుబాటు

టీఆర్ఎస్ లో టిక్కెట్లు దక్కని ఆశావాహులు పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు. ఖానాపూర్ టిక్కెట్ ఆశించి టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ టీఆర్ఎస్ ను వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఖానాపూర్ టిక్కెట్ ను కేసీఆర్ తాజా మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు ప్రకటించారు. అయితే, తాను ఖానాపూర్ నుంచి పోటీ చేయనున్నట్లు రమేశ్ రాథోడ్ ప్రకటించారు. తన గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఖానాపూర్ టిక్కెట్ తనకు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని ఆయన ఆరోపించారు.
Next Story

