Mon Mar 23 2026 02:10:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: టీఆర్ఎస్ కు గట్టి షాక్

టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ రాములు నాయక్ గట్టి షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న ఆయన టీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ లో నారాయణఖేడ్ నియోజకవర్గం టిక్కెట్ ను రాములు నాయక్ ఆశించారు. అయితే, ఈ టిక్కెట్ ఆయనకు దక్కలేదు. దీంతో కాంగ్రెస్ నాయకులతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయనను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం లేదా ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆయన నిన్న తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి ఆర్.సి.కుంతియాను కలిసి ఇదే విషయమై చర్చించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడం మాత్రం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Next Story

