Sun Mar 15 2026 10:59:13 GMT+0530 (India Standard Time)
తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్..?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే, బలమైన నేతగా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) పార్టీని వీడటం ఖాయంగా [more]
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే, బలమైన నేతగా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) పార్టీని వీడటం ఖాయంగా [more]

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే, బలమైన నేతగా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) పార్టీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది. తనకు కేసీఆర్, ఆయన బంధువుల నుంచి పార్టీలోకి రావాలని ఆహ్వానం అందిందని జగ్గారెడ్డి చెప్పారు. మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ… తాను గాంధీ భవన్ లో ఉంటానో తెలంగాణ భవన్ లో ఉంటానో త్వరలోనే తెలుతుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణలో కాంగ్రెస్ సేఫ్ గా ఉంటుందన్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది.
Next Story