Fri Mar 20 2026 21:19:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. నిన్న 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ వారిని చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి, వికారాబాద్ నుంచి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ లకు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ టీఆర్ఎస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఒకటిరెండు రోజుల్లో వీరిరువురూ గులాబీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనపడుతోంది. అయితే, ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లకు పోటీ ఉండటంతో అక్కడ టిక్కెట్ గ్యారెంటీ లేకపోవడం కూడా వీరి పార్టీ మార్పుకు కారణంగా కనపడుతోంది.
Next Story

