Thu Mar 19 2026 13:52:14 GMT+0530 (India Standard Time)
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ

ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత అశిష్ ఖేతన్ గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఆగస్టు 15నే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు పంపినట్లు ఆయన తెలిపారు. జర్నలిస్టుగా పనిచేసిన ఆశిష్ ఆమ్ ఆద్మీ ఏర్పడగానే అందులో చేరి కీలకనేతగా ఎదిగారు. 2014లో లోక్ సభకు పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే, తాను లీగల్ ప్రాక్టీసు చేసేందుకు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు క్రీయాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవలే మరో సీనియర్ నేత అశుతోష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Next Story

