Mon Mar 16 2026 10:35:53 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీఆర్ఎస్ గూటికి మరో ఎమ్మెల్యే

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరింది. ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో 88 మంది గెలిచిన విషయం తెలిసింది. మొన్న రామగుండం నుంచి టీఆర్ఎస్ రెబల్ గా బరిలో దిగి విజయం సాధించిన కోరుకంటి చందర్ టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇవాళ వైరా నుంచి కాంగ్రెస్ రెబల్ గా విజయం సాధించిన రాములు నాయక్ కూడా టీఆర్ఎస్ గూటికే చేరిపోయారు. ఇవాళ ఆయన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Next Story

