Wed Mar 18 2026 22:41:44 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: టీఆర్ఎస్ కి మరో నేత గుడ్ బై

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ కి మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిన్ననే రాజీనామా చేయగా... ఇవాళ వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి మహేందర్ రెడ్డి తనకు అన్యాయం చేశారని, పార్టీని నమ్ముకుంటే నమ్మకద్రోహం చేశారని, అవమానించారని ఆయన ఆరోపించారు. వికారాబాద్ లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ కు తన మద్దతు ఇస్తానని ప్రకటించారు.
Next Story

