Sat Mar 07 2026 19:33:32 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్: రాజీనామాకు రాయపాటి రెడీ..ఎందుకంటే..?
తెలుగుదేశం పార్టీకి నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ల విషయంలో పార్టీ తమకు అన్యాయం చేస్తుందనే అసంతృప్తితో ఉన్న ఆయన [more]
తెలుగుదేశం పార్టీకి నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ల విషయంలో పార్టీ తమకు అన్యాయం చేస్తుందనే అసంతృప్తితో ఉన్న ఆయన [more]

తెలుగుదేశం పార్టీకి నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ల విషయంలో పార్టీ తమకు అన్యాయం చేస్తుందనే అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఈసారి తనకు నరసరావుపేట ఎంపీ టిక్కెట్ తో పాటు తన కుమారుడు రంగారావుకు సత్తెనపల్లి ఎం ఎల్ ఏ టిక్కెట్ ఇవ్వాలని రాయపాటి కోరుతున్నారు. అయితే, వీరికి టిక్కెట్ల విషయం పార్టీ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. దీంతో పార్టీ మారాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన అసంతృప్తిని తెలియజేస్తారని ప్రచారం జరుగుతోంది.
Next Story