Sat Dec 13 2025 22:29:00 GMT+0000 (Coordinated Universal Time)
తుర్కియాలో మరోసారి భూకంపం : మృతుల సంఖ్య 34 వేలు
తుర్కియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఇటీవల వరసగా సంభవించిన భూకంపాల కారణంగా 34 వేల మంది మరణించారు.

తుర్కియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఇటీవల వరసగా సంభవించిన భూకంపాల కారణంగా 34 వేల మంది మరణించారు. ఇప్పటికీ శిధిలాల తొలగింపు కార్యక్రమం జరగుతుంది. అయితే తాజాగా టర్కీలో మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై 4.7 తీవ్రతగా నమోదయింది. ఈసారి భూకంపం దక్షిణ తుర్కియా నగరమైన కహ్రామన్మరాస్ కు సమీపంలో సంభవించింది.
ఉలిక్కిపడిన నగరవాసులు...
15.7 కిలోమీటర్ల లోతులో మరోసారి తుర్కియాలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇప్పటికే భూకంపం కారణంగా అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఇది తేరుకోక ముందే మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే ఈసారి ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం లేదని అధికారులు తెలిపారు.
- Tags
- earthquake
- turkey
Next Story

