Fri Dec 19 2025 01:48:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో మరో పాజిటివ్ కేసు…స్విమ్స్ లో కలకలం
ఆంధ్రప్రదేశ్ లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 12కు పెరిగాయి. విశాఖలో మరో యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. [more]
ఆంధ్రప్రదేశ్ లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 12కు పెరిగాయి. విశాఖలో మరో యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. [more]

ఆంధ్రప్రదేశ్ లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 12కు పెరిగాయి. విశాఖలో మరో యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏపీలో మొత్తం 384 కరోనా కేసులు నమోదవ్వగా ఇందులో 311 మందికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. మరో 55 మంది పరీక్షల కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు స్విమ్స్ లో కరోనా కలకలం రేపింది. హైదరాబాద్ లో ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు వైద్యులు ఈనెల 18వ తేదీన తిరుపతి వచ్చి స్విమ్స్ లో వైద్యులను కలవడంతో వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Next Story