Wed Jan 28 2026 20:47:32 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : విశాఖలో మరో దుర్ఘటన..ఏడుగురి మృతి
విశాఖపట్నంలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. హిందుస్థాన్ షిప్ యార్డులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కొత్తగా తెచ్చిన క్రేన్ తో ట్రయల్ [more]
విశాఖపట్నంలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. హిందుస్థాన్ షిప్ యార్డులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కొత్తగా తెచ్చిన క్రేన్ తో ట్రయల్ [more]

విశాఖపట్నంలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. హిందుస్థాన్ షిప్ యార్డులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కొత్తగా తెచ్చిన క్రేన్ తో ట్రయల్ రన్ నిర్వహిస్తుండటంతో ఒక్క సారిగా క్రేన్ విరిగి పడింది. దీంతో క్రేన్ కింద చిక్కుకుని ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. భారీ క్రేన్ విరిగి పడటంతో శిధిలాల కింద మరికొందరు ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదసమయంలో అక్కడ నలభై మందికి పైగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Next Story