Sat Jan 31 2026 19:25:57 GMT+0000 (Coordinated Universal Time)
సురక్షితంగా బయటపడిన మంత్రి అనిల్
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటనలో తేనెటీగల దాడి జరిగింది. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనపై తేనెటీగలు దాడిచేశాయి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో [more]
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటనలో తేనెటీగల దాడి జరిగింది. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనపై తేనెటీగలు దాడిచేశాయి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో [more]

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటనలో తేనెటీగల దాడి జరిగింది. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనపై తేనెటీగలు దాడిచేశాయి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు గన్ మెన్లు, అనుచరులు బయటకు పరుగులు తీశారు. గన్ మెన్లకు తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం తేనెటీగల దాడి నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. కర్నూలు జిల్లా పాములపాడు మండలం బానకచర్ల రెగ్యులేటర్ వద్ద ఈ ఘటన జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ కారులోనే కూర్చుని ఉండటంతో ఈ దాడి నుంచి బయటపడగలిగారు.
Next Story