ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు....!

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సుదీర్ఘ సమయం కొనసాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2ను 322 ఎకరాల్లో 2827 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తిరుపతి సమీపంలో వికృతమాల గ్రామంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 30కోట్ల 22లక్షలను అభివృద్ధి కోసం కేటాయించారు. 52,930మందికి ఉపాధి దీని ద్వారా లభిస్తుంది. ఏపీ లో అనేక సంస్థలు కార్యకలాపాలు నిర్వహించడానికి ఆసక్తి చూపుతున్నాయని సమావేశం అభిప్రాయ పడింది.
ఒంగోలు డెయిరీ పునరుద్ధరణ.....
ఒంగోలు డైరీ పునః ప్రారంభానికి పాత వారితో రాజీనామాలు చేయించి ,అధికారులతో కార్య నిర్వాహక వ్యవస్థ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఇందుకోసం 35కోట్లను ప్రభుత్వం రుణంగా ఇవ్వనుంది. బకాయిలు, వేతనాలు చెల్లిస్తారు.ఏపీ లో కమ్యూనికేషన్ టవర్ ఇన్ఫ్రా కోసం , మొబైల్ ,ఫైబర్ నెట్ , ఇతర టవర్ ల ఏర్పాటు కోసం కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికోసం జాయింట్ వెంచర్ ను ఏర్పాుటు చేస్తారు. ప్రభుత్వ స్థలాల్లో టవర్ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలతో సంబంధం లేకుండా సింగల్ విండో వ్యవస్థ ను ఏర్పాటు చేయనున్నారు.2వేల కోట్లతో ఈ కార్యక్రమం చేపడతారు. AP టవర్స్ తో పాటు మరికొన్ని సంస్థలతో దీనిని నిర్వహిస్తారు.నాణ్యమైన ప్రసారాలుసేవాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి వద్ద కాకినాడ సెజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ 200కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. మచిలీపట్నంలో 1380కోట్ల రుణ సేకరణకు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అనుమతులు ఇచ్చారు.
బాధితులకు భారీగా పరిహారం.....
భోగాపురం లో భూసేకరణ లో ఎకరాకు 33లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.విశాఖలో 15.5 ఎకరాల విస్తీర్ణంలో లులూ సంస్థ కన్వెన్షన్ నిర్మాణం చేపడతారు. స్థల అనుమతుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఆర్థిక శాఖలో cfms కి 56నిపోస్టులు, AP భవన్ లో జాయింట్ కమిషనర్ పోస్ట్ లకు ఆమోదం తెలిపింది.రాష్ట్రంలో అర్హులందసరికి పక్కా ఇళ్లు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.ప్రభుత్వ స్థలాలను నివాస ప్రాంతలుగా మారుస్తారు.ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు ఆమోదం తెలిపింది. పట్టాలు లేని వారికి ఇస్తారు. ప్రభుత్వ స్థలాలు లేని చోట భూమి కొనుగోలుకు 500కోట్ల కేటాయించింది. 10 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లలో ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతోంది.పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ఇళ్లకు కూడా 2లక్ష ల గ్రాంట్ ను మంజూరు చేసింది. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలలో ఫీజులు పెంపు లేక మూతబడుతున్నాయి. ఫీజుల పెంపు కోసం డిమాండ్ బాగా ఉంది. ఫీజుల్ని15500 నుంచి 25వేలకు , డి ఫార్మా ఫీ 17వేల నుంచి 27వేలకు పెంపునకు ఆమోదం తెలిపింది.85శాతం విద్యార్థులు ఫీజు నీయింబర్సుమెంట్ పరిధిలోకి వస్తారు... కాబట్టి వారిపై భారం ఉండదు.మహా రాష్ట్ర ,తమిళనాడు, యూపీ కంటే ఆంధ్రప్రదేశ్ లో ఫీజులు తక్కువ.పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ సామర్ధ్యం పెంపుకు చర్యలుచేపట్టాలని నిర్ణయించింది. నీటి ప్రవాహ సామర్ధ్యం పెంపు వల్ల భారం 387కోట్లకు పెరిగింది. దానిని చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.అనంతపురం కియా కార్ల ప్లాంట్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 3.18కోట్ల ఖర్చు తో ఏర్పాటుకు ఆమోదంతెలిపింది. .ఎర్రమంచి గ్రామం వద్ద పోలీస్ స్టేషన్ ను ఏర్పాటుచేయనున్నారు పూర్తయిన జల వనరుల ప్రాజెక్టులు ap జల వనరుల అభివృద్ధి సంస్థకి అప్పగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాని ద్వారా ప్రాజెక్ట్ ల మీద అప్పులు తెచ్చుకునే అధికారం లభిస్తుంది.
