Thu Mar 19 2026 13:08:19 GMT+0530 (India Standard Time)
Andhra : ఏపీలో నేడు కూడా మోస్తరు వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో నేడు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చెన్నైకి సమీపంలో వాయుగుండం తీరం దాటినా 24 గంటల పాటు వర్షాలు తప్పవని చెప్పింది. [more]
ఆంధ్రప్రదేశ్ లో నేడు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చెన్నైకి సమీపంలో వాయుగుండం తీరం దాటినా 24 గంటల పాటు వర్షాలు తప్పవని చెప్పింది. [more]

ఆంధ్రప్రదేశ్ లో నేడు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చెన్నైకి సమీపంలో వాయుగుండం తీరం దాటినా 24 గంటల పాటు వర్షాలు తప్పవని చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి సమీపంలో తీరం దాటింది. అయితే మరో వైపు ఈ ప్రభావంతో 24 గంటల పాటు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని విపత్తుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story