Mon Feb 02 2026 01:49:00 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు మొదటి స్థానం... ఇండియా టుడే సర్వే
దేశ వ్యాప్తంగా ఇండియా టుడే జరిపిన సర్వే లో ఇన్ క్లూజివ్ గ్రోత్ సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.

దేశ వ్యాప్తంగా ఇండియా టుడే జరిపిన సర్వే లో ఇన్ క్లూజివ్ గ్రోత్ సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్ పేరిట నిర్వహించిన సర్వేలో తొలి స్థానం దక్కించుకుంది. గత ఏడాది ఇదే రంగంలో ఏడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తొలి స్థానాన్ని దక్కించుకుంది.
గ్రామీణాభివృద్ధి....
గ్రామీణ, పట్టణ ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సర్వే నిర్వహిస్తారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానం దక్కించుకుంది. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాల అమలు, ఇంటింటికి రేషన్, పింఛను వంటి చర్యలతో ఈ ర్యాంకు సాధ్యమయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Next Story

