Mon Mar 16 2026 00:28:13 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీలో లాక్ డౌన్ లో మరింత సడలింపులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను మరింత సరళతరం చేసింది. కంటెయిన్ మెంట్ జోన్లు, హాట్ స్పాట్ ల తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను మరింత సరళతరం చేసింది. కంటెయిన్ మెంట్ జోన్లు, హాట్ స్పాట్ ల తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను మరింత సరళతరం చేసింది. కంటెయిన్ మెంట్ జోన్లు, హాట్ స్పాట్ ల తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు కొనసాగించడానికి వెసులుబాటు కల్పించింది. అన్ని ప్రాంతాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అంగీకరించింది. వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో అక్కడి అధికారులు వ్యాపార సంస్థలకు సరి, బేసి సంఖ్యలో అనుమతివ్వాలని నిర్ణయించారు. భౌతిక దూరం పాటించేలా వ్యాపారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల కానున్నాయి.
Next Story