Thu Mar 19 2026 11:00:12 GMT+0530 (India Standard Time)
మహేష్ బాబుకు జగన్ ఓదార్పు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. అమరావతి నుంచి వచ్చిన ఆయన నేరుగా పద్మాలయా స్టూడియోస్ కు వెళ్లి మహేష్ కుటుంబాన్ని పరామర్శించారు. మహేష్ బాబును ఆలింగనం చేసుకుని జగన్ వారితో మాట్లాడారు. మహేష్ బాబు కుటుంబ సభ్యులను ఒక్కొక్కరినీ పరిచయం చేసుకుని వారికి ధైర్యం చెప్పేందుకు జగన్ ప్రయత్నించారు.
విలపించిన జయప్రద...
అక్కడే ఉన్న గల్లా జయదేవ్, గల్లా అరుణకుమారిలను కూడా జగన్ పరామర్శించారు. నిన్న కృష్ణ పార్దీవదేహాన్ని చూడలేని ఏపీ నేతలందరూ ఈరోజు పద్మాలయా స్టూడియోకు వస్తున్నారు. జగన్ వెంట మంత్రులు కూడా ఉన్నారు. సినీ నటి జయప్రద కూడా అదే సమయంలో వచ్చి కృష్ణకు నివాళులర్పించారు. ఆమె కృష్ణ భౌతిక కాయాన్ని చూసి కన్నీరు పెట్టుకుంది. తాను కృష్ణతో నటించిన సినిమాలను గుర్తు చేసుకుని ఆమె విలపించింది.
Next Story

