Sat Mar 07 2026 16:52:27 GMT+0530 (India Standard Time)
వారికి ఫోన్ నెంబరు ఇచ్చిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ వరద బాధితులను పరామర్శిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ వరద బాధితులను పరామర్శిస్తున్నారు. పులపత్తూరు గ్రామంలో పర్యటిస్తున్న జగన్ ను డ్వాక్వా మహిళలు తమ ఆవేదనను తెలియజేశారు. డ్వాక్రామహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తామని జగన్ చెప్పారు. వారికి ప్రత్యేక ప్రయోజనాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని జగన్ హమీ ఇచ్చారు.
పరిహారం అందలేదని.....
ఇక కొందరు మహిళలు తమకు నష్ట పరిహారం అందలేదని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ పై నేరుగా జగన్ కు వారు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ వెంటనే ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ఫోన్ నెంబరును జగన్ వారికి ఇచ్చారు. సాయంత్రంలోగా కలెక్టర్ పరిహారం ఇవ్వకపోతే ఈ నెంబరుకు ఫోన్ చేయాలని జగన్ వారికి చెప్పారు. ఫోన్ నెంబరును జగన్ స్వయంగా ఇవ్వడం చూసి అధికారులు సయితం విస్తుపోయారు.
Next Story

