Mon Feb 02 2026 04:58:52 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ బంద్ లో విషాదం

ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపునిచ్చిన బంద్ లో విషాదం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా బుట్టాయగూడెంలో పార్టీ నేత తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు కూడా పాల్గొన్నారు. ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో దుర్గారావు ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో విషాదచాయలు అలుముకున్నాయి. దుర్గారావు మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. హోదా పోరులో దుర్గారావు అమరుడయ్యాడని ఆయన పేర్కొన్నారు.
Next Story

