Sun Feb 01 2026 13:00:15 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఘోర ప్రమాదం...ఆరుగురు మృతి

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ పైప్ లీకై పరిశ్రమలో పనిచేస్తున్న ఆరుగురు మరణించారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇనుప కడ్డీలు తయారుచేసే ఈ కంపెనీలో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు, గాయపడ్డ వారు ఆంధ్రప్రదేశ్ తో పాటు బిహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. అపస్మారక స్థితిలో ఉన్న ఆరుగురిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి, అనంతపురం ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మృతులు రంగయ్య, మనోజ్, గంగాధర్, వర్షిత్, లింగమయ్య, గురువయ్యగా తెలుస్తోంది.
Next Story

