Wed Mar 25 2026 01:42:46 GMT+0530 (India Standard Time)
కేంద్రమంత్రి మృతి

కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మృతి చెందారు. ఆదివారం అర్థరాత్రి ఆయన కన్నుమూశారు. అనంతకుమార్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అనంతకుమార్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. బెంగళూరు సౌత్ లోక్ సభ స్థానం నుంచి ఆరుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన అనంతకుమార్ బీజేపీలో సీనియర్ నేత. మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కింది. అనంత్ కుమార్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Next Story

