Mon Mar 23 2026 14:48:37 GMT+0530 (India Standard Time)
ఆనం ఫ్యామిలీని ఓదార్చిన జగన్

నిన్న అనారోగ్యంతో మృతి చెందిన ఆనం వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆనం రామనారాయణరెడ్డి, విజయకుమార్ రెడ్డిలతో జగన్ ఫోన్లో మాట్లాడారు. ఆనం వివేకా మృతి తీరని లోటు అని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆనం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆనం వివేకానందరెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు వెళ్లి నివాళులర్పించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్దయెత్తున తరలి వచ్చి ఆనం వివేకానందరెడ్డి భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి ఆనం అభిమానులు తరలి వచ్చారు. మరికాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కానుంది. పెన్నా నది ఒడ్డున ఆనం అంత్యక్రియలు జరగనున్నాయి.
Next Story

