Mon Mar 23 2026 02:26:35 GMT+0530 (India Standard Time)
షాకు షాకిచ్చిన టీడీపీ

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన అమిత్ షాను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న తర్వాత తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుందామనుకున్నారు అమిత్ షా. బెంగళూరు నుంచి తిరుమల చేరుకున్న అమిత్ షాను అలిపిరి టోల్ గేట్ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. శ్రీవారి సాక్షిగా హామీ ఇచ్చి అమలు చేయకపోవడాన్ని వారు తప్పుపట్టారు. వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి మోసం చేసి మళ్లీ తిరుమలకు ఎలా వస్తారని కార్యకర్తలు నిలదీశారు. నల్లబ్యాడ్జీలతో నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీసులు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అలిపిరి నుంచి అమిత్ షా శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు.
Next Story

