Sun Feb 01 2026 14:14:09 GMT+0000 (Coordinated Universal Time)
రామోజీతో అమిత్ షా భేటీ

మీడియా మొఘల్, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిశారు. శుక్రవారం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి హైదరాబాద్ వచ్చిన అమిత్ షా మొదట హోటల్ కత్రియాలో ఆర్ఎస్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అనంతరం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లిన ఆయన రామోజీరావుతో సమావేశమయ్యారు. సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో బీజేపీ నాలుగేళ్లుగా చేసిన పనులను ప్రముఖులను కలిసి వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే అమిత్ రామోజీరావును కలిశారు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావాలని బీజేపీ భావిస్తోన్న నేపథ్యంలో బలమైన మీడియా అధినేతగా ఉన్న రామోజీని కలవడం ఆసక్తికరంగా మారింది.
Next Story

