Thu Mar 19 2026 04:08:50 GMT+0530 (India Standard Time)
అమెరికాలో తెలుగు యువకుడి మృతి

ఉన్నత చదువులు చదివి అమెరికాలో మంచి ఉద్యోగం స్థిరపడ్డ ఓ తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి విషాదం నింపింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన నాగార్జున పదేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఉద్యోగంలో చేరి స్థిరపడ్డారు. అయితే, స్నేహితులతో కలిసి విహార యాత్ర కోసం అమెరికా నార్త్ కరోలినా సమీపంలోని ఓ జలపాతానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించారు. ఈ విషయాన్ని ఆయన మిత్రులు నాగార్జున కుటుంబసభ్యులకు చెప్పడంతో స్వగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Next Story

