Thu Mar 19 2026 07:02:10 GMT+0530 (India Standard Time)
అమెరికాలో మళ్లీ కాల్పులు...!

అమెరికా కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఒక దుండగుడు సృష్టించిన వీరంగంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మేరీ ల్యాండ్ లోని అన్నా పోలీస్ లో క్యాపిటల్ గెజిట్ పత్రికా కార్యాలయంలో ఈ కాల్పులు జరిగాయి. నాలుగు అంతస్థుల ఈ భవనంలో గ్లాస్ డోర్ నుంచి దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అక్కడ ఉన్న సిబ్బందికి కాసేపు అర్థంకాక భయంతో పరుగులు తీశారు. కొందరు టేబుల్స్ కింద దాక్కున్నారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో కొందరు క్షతగాత్రులయ్యారు.
Next Story

