Sun Mar 22 2026 18:31:14 GMT+0530 (India Standard Time)
ఏపీలో నయా దందా

ఏపీ లోని అమరావతిలో రేషన్ బ్రాండ్ పేరుతో నయా దందా షురూ అయింది. రేషన్ బ్రాండ్ ఉత్పత్తుల పంపిణీ కోసం జిల్లాకు 300 మంది డిస్ట్రిబ్యూటర్ లు కావాలంటూ ప్రచారం చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ కోసం లక్ష రూపాయల డిపాజిట్ వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రేషన్ బ్రాండ్ తో ప్రభుత్వానికి, పౌర సరఫరాల శాఖకు సంబంధం లేదని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పౌర సరఫరాల శాఖ చెబుతోంది. విశాఖ, గుంటూరులలో ఈ నయాదందా వెలుగు చూసింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం వీరిచేతిలో మోసపోవద్దని పేర్కొంది.
Next Story

