జగన్ శ్రీవారి భక్తుడే
రాజకీయాల్లో మతాన్ని తీసుకువచ్చి ఇబ్బంది పెట్టాలని టీడీపీ, జనసేన చూస్తుందని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. వైఎస్ జగన్ క్రైస్తవ మతాన్ని తీసుకున్నారని పవన్ కల్యాణ్ [more]
రాజకీయాల్లో మతాన్ని తీసుకువచ్చి ఇబ్బంది పెట్టాలని టీడీపీ, జనసేన చూస్తుందని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. వైఎస్ జగన్ క్రైస్తవ మతాన్ని తీసుకున్నారని పవన్ కల్యాణ్ [more]

రాజకీయాల్లో మతాన్ని తీసుకువచ్చి ఇబ్బంది పెట్టాలని టీడీపీ, జనసేన చూస్తుందని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. వైఎస్ జగన్ క్రైస్తవ మతాన్ని తీసుకున్నారని పవన్ కల్యాణ్ అన్నారని, జగన్ పాదయాత్రకు ముందు, తర్వాత కాలినడకన తిరుమలకు వెళ్లి దర్శించుకున్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ఏ మతమో జగన్ దీ అదే మతమని చెప్పారు. వెంకటేశ్వరస్వామిని జగన్ విశ్వసిస్తారని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబుకు మద్దతు పలుకుతున్న పవన్ కల్యాణ్ కు ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలన్నారు. లింగమనేని రమేష్, నాదెండ్ల మనోహర్ లు మధ్యవర్తులుగా వ్యవహరించలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన వారికే గత ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వలేదా? అని పవన్ కల్యాణ్ ను అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇసుక, ఇంగ్లీష్ తప్ప రాష్ట్రంలో ఏ సమస్య లేనట్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు దూతగానే ఢిల్లీ కి వెళ్లారని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు.