Sat Mar 21 2026 00:39:20 GMT+0530 (India Standard Time)
కోదండరాం పార్టీపై తీవ్ర ఆరోపణలు

ప్రొ.కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితిపై ఆ పార్టీ మహిళా నాయకురాలు జ్యోత్స్న తీవ్ర ఆరోపణలు చేశారు. జన సమితి కోదండరాం లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడం లేదని, మనీ మిషన్ గా మారిపోయిందని ఆరోపించారు. పార్టీలో ముఖ్య నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ టిక్కెట్లను అమ్ముకుంటున్నారని, టిక్కెట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తనవద్ద కూడా రూ 2 లక్షలు తీసుకున్నారని, అడిగితే దబాయిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలో ఈ పరిణామాలు కోదండరాంకు తెలుసో.. తెలియదో అని అన్నారు.
Next Story

