Wed Mar 18 2026 23:44:16 GMT+0530 (India Standard Time)
ఎంపీ సుమన్ పై లైంగిక ఆరోపణలు అవాస్తవాలు

పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పై వస్తోన్న లైంగిక ఆరోపణలు అవాస్తవమని మంచిర్యాల సీఐ మహేష్ తెల్చారు. సుమన్ పై వైరల్ అవుతున్న వార్తలో వాస్తవం లేదన్నారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాలలో ఏర్పాటుచేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎంపీపై ఆరోపణలు చేస్తున్న బోయిన సంధ్య, విజేత ఎంపీని ట్రాప్ చేసి డబ్బులు వసూలుచేయాలని ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు. వీరిద్దరిపై గతంలోనూ బ్లాక్ మెయిల్ కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు. సుమన్ పై బ్లాక్ మెయిల్ చేసిన ఆరోపణలపై వీరిద్దరిపై ఫిబ్రవరి 6న కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎంపీ కుటుంబసభ్యుల ఫోటోను వైరల్ చేసినందుకు సంధ్య, విజేతలపై ఐపీసీ 420 , 292ఏ, 419, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Next Story

