Fri Mar 20 2026 00:58:17 GMT+0530 (India Standard Time)
ప్లేట్ ఫిరాయించిన అళగిరి

డీఎంకేలో ఇంటిపోరు సమిసిపోయే అవకాశం కనిపిస్తున్నాయి. నిన్నటివరకు తమ్ముడు స్టాలిన్ పై ఒంటి కాలితో లేచిన అన్న అళగిరి ఇప్పుడు దూకూడే తగ్గించారు. పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో ఇక చేసేదేమీ లేదనుకున్నరో ఏమో గానీ తమ్ముడు స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తానని ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనను పార్టీలోకి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, తనను తిరిగి చేర్చుకుంటే స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తానని ప్రకటించారు. అయితే, ఇంతకాలం స్టాలిన్ పై అళగిరి తీవ్రంగా మండిపడ్డారు. సెప్టెంబర్ 5న చైన్నైలో తండ్రి మరణానికి సంతాపంగా భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేయాలని భావించిన విషయం తెలిసిందే.
Next Story

