Fri Mar 20 2026 23:17:01 GMT+0530 (India Standard Time)
అఖిలప్రియ ఫుల్లు క్లారిటీ ఇచ్చారుగా...

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అఖిలప్రియ క్లారిటీ ఇచ్చారు. తాను 2019లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరుపునే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన స్థానం నుంచే పోటీ చేస్తానన్నారు. ఇక ఇటీవల తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను అఖిలప్రియ సమర్థించుకున్నారు. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోనని స్పష్టం చేశారు. ఒక మహిళగా, మంత్రిగా దేశంలో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఆవేదనతోనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ప్రధానిపై అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆమెను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని ఏపీ బీజేపీ నేతలు గవర్నర్ ను కలిసి కూడా విన్నవించారు.
Next Story

