Mon Mar 23 2026 14:48:48 GMT+0530 (India Standard Time)
అక్క వైపు వేలెత్తి చూపితే....?

ఆళ్లగడ్డ రాజకీయాలు ముదిరిపాకాన పడుతున్నాయి. కౌంటర్ మీద కౌంటర్లు వస్తున్నాయి. భూమా కుటుంబంతో తనకు సంబంధాలు తెగిపోయినట్లేనని ఏవీ సుబ్బారెడ్డి నిన్న ప్రకటించగా, ఈరోజు మంత్రి అఖిప్రియ సోదరి నాగమౌనిక స్పందించారు. అక్క జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. తమ కుటుంబమంతా అక్కా వెంట నిలుస్తామని చెప్పారు. ఆళ్లగడ్డ ప్రజలంతా భూమాకుటుంబం వెంటే ఉన్నారన్నారు. రాజకీయంగా ఎదగాలనుకుంటే ఏవీ సుబ్బారెడ్డికి తమ సహకారం ఉంటుందని, అయితే అక్క వైపు వేలెత్తి చూపితే ఊరుకోబోమని హెచ్చరించారు. భూమానాగిరెడ్డి వర్థంతి రోజున ఆయన సమాధి వద్దకు రానప్పుడే వారితో తమకు సంబంధాలు తెగిపోయాయని చెప్పారు. ఈ పంచాయతీని ముఖ్యమంత్రి తేల్చాల్సిందేనని నాగమౌనిక కోరారు.
Next Story

