Sun Mar 15 2026 20:15:42 GMT+0530 (India Standard Time)
గవర్నర్ వద్దకు అఖిలప్రియ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్ ను ఈరోజు టీడీపీ నేతలు కలవనున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులపై గవర్నర్ తో చర్చించనున్నారు. ప్రధానంగా మాజీ [more]
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్ ను ఈరోజు టీడీపీ నేతలు కలవనున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులపై గవర్నర్ తో చర్చించనున్నారు. ప్రధానంగా మాజీ [more]

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్ ను ఈరోజు టీడీపీ నేతలు కలవనున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులపై గవర్నర్ తో చర్చించనున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్తపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులను పెట్టిందని గవర్నర్ దృష్టికి తేనున్నారు. అక్రమ కేసులను పెట్టి వేధిస్తూ తమను పార్టీకి దూరం చేయాలని వైసీపీ సర్కార్ కుట్ర పన్నిందన్నది టీడీపీ నేతల ఆరోపణ. అందుకే అఖిలప్రియ కుటుంబ సభ్యులపై అక్రమ కేసుల అంశాన్ని రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగేలా గవర్నర్ ను కలవాలని టీడీపీ నిర్ణయించింది.
Next Story