Thu Mar 19 2026 19:52:00 GMT+0530 (India Standard Time)
అఖిలమ్మ పెళ్లికూతురాయెనే..!

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాపారవేత్త భార్గవనాయుడుతో ఆమె వివాహం జరగనుంది. 29న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని శోభా నాగిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో వివాహ వేడుక జరగనుంది. కాగా నిన్న అఖిలప్రియను పెళ్లికూతురుని చేశారు. బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 29న జరగనున్న వివాహ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించారు అఖిల ప్రియ. ఇక స్వంత నియోజకవర్గంలోనూ ఆమె ఇంటింటికి వివాహ ప్రతికను పంపించారు. ఇందుకు గానూ ఒక లారీ కార్డులను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి మండపం సెట్టింగును గోవా బృందం వేస్తోంది. అఖిలప్రియను పెళ్లి కూతురు చేసిన ఫొటోలు ‘‘తెలుగుపోస్ట్’’కు ప్రత్యేకం.


Next Story

