Sun Mar 15 2026 07:14:34 GMT+0530 (India Standard Time)
టీడీపీ ఊహించిందే అయినా?
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. అయన కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిపోయారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి గత కొంతకాలంగా [more]
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. అయన కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిపోయారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి గత కొంతకాలంగా [more]

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. అయన కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిపోయారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి గత కొంతకాలంగా పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. ఆదినారాయణరెడ్డి కూడా తాను పార్టీ మారనున్నట్లు ప్రకటించారు. బీజేపీలో చేరబోతున్నట్లు తెలిపారు. కానీ దాదాపు నెలన్నర రోజులుగా ఆయన పార్టీలో చేరలేదు. రెండుసార్లు పార్టీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లినప్పటికీ ఆయనకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆయన చేరికను కొందరు బీజేపీ నేతలే అడ్డుకుంటున్నారన్న ప్రచారమూ జరిగింది. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి ఈరోజు బీజేపీలో చేరారు.
Next Story