Fri Mar 20 2026 02:54:31 GMT+0530 (India Standard Time)
జగన్ కు అది ఇష్టం లేదు

రాష్ట్రం బాగుపడటం ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు. గుంటూరు నారా హమారా సభలో గందరగోళం సృష్టించాలని జగన్ కుట్ర చేశారని ఆరోపించారు. అరెస్ట్ అయిన ముస్లిం యువకుల్లో నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు. సభలో అలజడి సృష్టించాలనుకోవడం హేయమైన చర్య అని విమర్శించారు. జగన్ చేసేవి దొంగ యాత్రలని ఎద్దేవా చేశారు.
Next Story

