Sun Mar 15 2026 07:15:20 GMT+0530 (India Standard Time)
భద్రత కల్పించకపోవడానికి కారణాలేంటి?
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తనకు భద్రత కల్పించాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. భద్రతకు అయ్యే ఖర్చులు తానే భరిస్తానని ఆయన పేర్కొన్నారు. హైకోర్టులో జరిగిన విచారణలో ఆదినారాయణరెడ్డికి [more]
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తనకు భద్రత కల్పించాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. భద్రతకు అయ్యే ఖర్చులు తానే భరిస్తానని ఆయన పేర్కొన్నారు. హైకోర్టులో జరిగిన విచారణలో ఆదినారాయణరెడ్డికి [more]

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తనకు భద్రత కల్పించాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. భద్రతకు అయ్యే ఖర్చులు తానే భరిస్తానని ఆయన పేర్కొన్నారు. హైకోర్టులో జరిగిన విచారణలో ఆదినారాయణరెడ్డికి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేమిటో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. భద్రత ఖర్చులన్నీ పిటీషనర్ భరిస్తానంటున్నందున ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఆదినారాయణరెడ్డికి భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
Next Story