Wed Jan 28 2026 17:12:40 GMT+0000 (Coordinated Universal Time)
ఇప్పటి వరకూ అయితే ఆలోచన లేదు
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలను మూసివేయడంపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఏపీలో కరోనా వ్యాప్తి పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో విపక్షాలు [more]
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలను మూసివేయడంపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఏపీలో కరోనా వ్యాప్తి పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో విపక్షాలు [more]

ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలను మూసివేయడంపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఏపీలో కరోనా వ్యాప్తి పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో విపక్షాలు కూడా పాఠశాలలను నిర్వహిస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిరోజూ పాఠశాలల్లో పరీక్షలు చేయిస్తూ వచ్చిన నివేదికలను అధ్యయనం చేస్తున్నామని ఆదిమూలపు సురేష్ చెప్పారు. పాఠశాలల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సురేష్ చెప్పారు. పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించడానికి తాము ప్రస్తుతం సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటారని ఆదిమూలపు సురేష్ చెప్పారు.
Next Story