Sat Mar 21 2026 11:02:09 GMT+0530 (India Standard Time)
జగన్ ను కలిసిన నటుడు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ఫిలిం ఇండస్ట్రీలో ఫ్యాన్స్ పెరుగుతున్నట్లు కనపడుతోంది. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు, నటులు పోసాని కృష్ణమురళి, పృధ్వి వంటి వారు జగన్ ను కలిసి తమ మద్దతు ప్రకటించారు. ఇక హీరో కృష్ణుడు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా వివిధ సినిమాల్లో నటించిన ఫిష్ వెంకట్ జగన్ ను కలిసి మద్దతు తెలిపారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం ప్రాంతంలో జరుగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో జగన్ తో కలిసి నడిచారు.
Next Story

