Sun Mar 22 2026 22:59:07 GMT+0530 (India Standard Time)
శబరిమలలో అడుగుపెడితే నరికేస్తా

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో సంప్రదాయానికి విరుద్ధంగా అడుగుపెడితే అడ్డంగా నరికేస్తానని సినీ నటుడు కొల్లం తులసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కేరళలో బీజేపీకి మద్దతుదారుడిగా ఉన్నారు. అన్ని వయస్సుల మహిళలు అయ్యప్ప ఆలయానికి రావచ్చని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును అయ్యప్ప స్వామి భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆలయంలోకి స్త్రీలను అనుమతించడం అంటే స్వామి పవిత్రతను దెబ్బతీయడమే అని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళలో జరిగిన ఓ సమావేశంలో తులసి మాట్లాడుతూ... అయ్యప్ప ఆలయంలోకి వచ్చే మహిళలను నరికేసి సగ భాగం కేరళ ముఖ్యమంత్రికి మిగతా సగభాగం ఢిల్లీకి పంపిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Next Story

