అచ్యుతరావు కరోనాతో మృతి
బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు కరోనాతో మృతిచెందాడు. గత కొన్ని రోజుల నుంచి కరోనా తో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మలక్ పేట లోని [more]
బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు కరోనాతో మృతిచెందాడు. గత కొన్ని రోజుల నుంచి కరోనా తో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మలక్ పేట లోని [more]

బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు కరోనాతో మృతిచెందాడు. గత కొన్ని రోజుల నుంచి కరోనా తో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మలక్ పేట లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. అచ్యుత రావు తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. వీళ్ళంతా కూడా కరోనా నుండి కోలుకొని రెండు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. అయితే అచ్యుత రావు కు అనేక రకమైన అనారోగ్య కారణాలు ఉండటంతో మలక్ పేట లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత ఐదు రోజుల నుంచి కూడా వెంటిలేటర్ పై ఉన్నాడు. అయితే కొద్దిసేపటి క్రితమే అచ్యుతరావు పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. అతనికి చికిత్స అందిస్తున్న తరుణంలోనే అచ్యుతరావు మరణించినట్లుగా ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. చాలా మంది బాలకార్మికులు విముక్తి కోసం అచ్యుతరావు పోరాటం చేశారు. అంతేకాకుండా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పెద్దఎత్తున పనిచేశాడు. గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలల హక్కుల కమిషన్ కు చైర్మన్ గా కూడా వ్యవహరించారు.

