Fri Dec 05 2025 16:34:59 GMT+0000 (Coordinated Universal Time)
achennaidu : వైసీపీ పై అసంతృప్తి మొదలు… అచ్చెన్న జోస్యం
వైసీపీ పాలన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. అక్రమ కేసులు [more]
వైసీపీ పాలన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. అక్రమ కేసులు [more]

వైసీపీ పాలన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. అక్రమ కేసులు బనాయిస్తూ, స్టేషన్లలో గంటల తరబడి కూర్చోబెడుతూ టీడీపీ క్యాడర్ ను వేధింపులకు గురిచేస్తున్నారని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వం వచ్చాక విపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంతో పోలీసుల కుమ్మక్కై వ్యవహరిస్తున్న తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
Next Story