Sun Mar 15 2026 05:55:27 GMT+0530 (India Standard Time)
రోడ్లన్నీ గుంతలే… జగన్ అవినీతికి ప్రతిరూపాలు
వైఎస్ జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగనన్న గుంతల పథకంతో ప్రజలు రెడ్డెక్కాలంటే భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో [more]
వైఎస్ జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగనన్న గుంతల పథకంతో ప్రజలు రెడ్డెక్కాలంటే భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో [more]

వైఎస్ జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగనన్న గుంతల పథకంతో ప్రజలు రెడ్డెక్కాలంటే భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో ఉన్న రోడ్లన్నీ జగన్ ప్రభుత్వం అవినీతికి ప్రతిరూపాలని అచ్చెన్నాయుడు అభివర్ణించారు. ప్రజలు తమ గమ్యం చేరకముందే గతించేటట్లు రోడ్లపై గుంతలు ఉన్నాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రెండేళ్లుగా రోడ్లకు మరమ్మతులు చేయాలన్న ఆలోచన కూడా జగన్ కు లేకపోవడం దురదృష్టకరమని అచ్చెన్నాయుడు అన్నారు. వెంటనే రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులకు నిధులు విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
Next Story