Sun Mar 15 2026 07:15:59 GMT+0530 (India Standard Time)
జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని వీడలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండి పడ్డారు. టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని వీడలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండి పడ్డారు. టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని వీడలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండి పడ్డారు. టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం బసలదొడ్డిలో టీడీపీ సానుభూతిపరులకు మంచినీటి సరఫరాను నిలిపేయడం హేయమైన చర్య అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల వాళ్లకు కనీసం తాగునీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. టీడీపీకి ఓట్లు వేసిన పాపానికి రేషన్, పింఛను చివరికి తాగునీటిని కూడా నిలిపేశారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
Next Story