Sun Mar 15 2026 13:21:40 GMT+0530 (India Standard Time)
వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది
స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ భయపడుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తాము ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు [more]
స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ భయపడుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తాము ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు [more]

స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ భయపడుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తాము ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పుడు గోల గోల చేసిన వైసీపీ నేతలు, ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతుంటే ఎన్నికలు వద్దంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీకి ఓటమి భయం పట్టకుందని అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నికల కమిషనర్ ను కులం పేరుతో దూషించిన ముఖ్యమంత్రి ప్రాంతాలు, కులాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కమిషనర్ కు చెప్పినట్లు అచ్చెన్నాయుడు అన్నారు.
Next Story