Sun Mar 15 2026 22:19:54 GMT+0530 (India Standard Time)
అధికారులూ..జగన్ తో జాగ్రత్త
జగన్ అధికారులను మానసికంగా వేధిస్తున్నారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఉదయ్ భాస్కర్ లు తామ చెప్పినట్లు వినడం లేదని బెదిరిస్తున్నారని [more]
జగన్ అధికారులను మానసికంగా వేధిస్తున్నారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఉదయ్ భాస్కర్ లు తామ చెప్పినట్లు వినడం లేదని బెదిరిస్తున్నారని [more]

జగన్ అధికారులను మానసికంగా వేధిస్తున్నారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఉదయ్ భాస్కర్ లు తామ చెప్పినట్లు వినడం లేదని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు గవర్నర్ వద్దకు వెళ్లి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్ తాను అనుకున్నది చేయాలంటారని, చట్టాలు, నిబంధలను చెబితే అలాంటి అధికారులను ఇబ్బంది పెడతారని అచ్చెన్నాయుడు చెప్పారు. గతంలో జగన్ చెప్పినట్లే చేసిన అధికారులు జైలు పాలయిన విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
Next Story