Sun Mar 15 2026 09:16:32 GMT+0530 (India Standard Time)
రాజప్రసాదం నుంచి బయటకు రా జగన్?
ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో జగన్ ను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు [more]
ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో జగన్ ను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు [more]

ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో జగన్ ను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు రావాలని కోరారు. పశ్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప లు క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటే, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తాడేపల్లి రాజప్రసాదం నుంచి బయటకు రావడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. కరోనా సమయంలో ప్రజలకు భరోసా కల్పించాల్సిన ముఖ్యమంత్రి జగన్ కార్యాలయానికే పరిమితమయ్యారన్నారు. 77 ఏళ్ల ముఖ్యమంత్రి యడ్యూరప్ప, 60 ఏళ్ల మమత బెనర్జీని చూసి నేర్చుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు.
Next Story

